డ్యాంలో పడి విద్యార్థి మృతి

jljem294నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. పశ్చిబెంగాల్ లో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునగాల మండలం రామలింగబండ గ్రామానికి చెందిన ఎర్రశెట్టి వంశీ బెంగాల్ దుర్గాపూర్ లో నిట్ లో బిటెక్ మొదటి సంవత్సరం కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వంశీ బృందం.. దుర్గాపూర్ సమీపంలోని రిజర్వాయర్ చూడటానికి వెళ్లింది. వంశీ… ప్రమాదవశాత్తు డ్యాంలో పడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు తీవ్రంగా బాధపడ్డారు. సమాచారం తెలుసుకున్న వంశీ తల్లిండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం కోసం తల్లిదండ్రులు బెంగాల్ వెళ్లారు