డ్రైనేజీసమస్య, రోడ్డు విస్తరణ గురించి రాస్తారోకో
గొల్లపెల్లి , జూన్11 (జనంసాక్షి):
మండలంలోని రాఘవపట్నం లో డ్రైనేజ్‌మరియు రోడ్డువెడల్పు గురించి 15 మహిళా సంఘాలు దాదాపు 200 మంది మహళలు గొల్లపెల్లి ఎంఆర్వోకు గత 15 రోజుల ముందు వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఆర్వో యం.శంకర్ గ్రామంలోకి వచ్చి సమస్యలు చూసి వారంరోజుల్లోగా వారి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. 15 రోజులు గడిచిన తర్వాత వర్షాలు కురువడంతో డ్రైనేజీ వాటర్ మరియు వర్షపునీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో మహిళలు ట్రాక్టర్ల సహాయంతో గొల్లపెల్లికి చేరుకుని ఎంఆర్వో ఆఫీస్ ముందు రోడ్డుపైన దాదాపు ఒక గంటవరకు బైటాయించి రాస్తారోకో చేశారు. అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో ఎంఆర్వో డౌన్‌డౌన్ అని మహిళలు నినాదాలు చేశారు. తదుపరి అధికారులు వచ్చి వారికిగ్రామంలోకి వచ్చి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి గ్రామానికి వెల్లిపోయారు. సంబందిత అధికారులు ఎఈ మరియు ఎఓగ్రామానికి వచ్చి డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి వారిసమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ అరవింద్ గౌడ్, యంపీటీసీ అశోక్‌రావు, అదర్శయూత్ అద్యక్షులు సింగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మోహన్ రెడ్డి, రాజిరెడ్డి, జలేంధర్‌రెడ్డి , నందిరెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, రాజేశం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.