డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు:హరీశ్

మెదక్:త్వరలో డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని మంత్రిహరీష్‌రావు ప్రకటించారు. టేక్మాల్ లో ఆయన మిషన్ కాకతీయను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ, డ్వాక్రా మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించనుందని తెలిపారు. ఆందోల్‌ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.