డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తుకు ఇంకొక అవకాశం కల్పించాలి
-అప్పం శ్రావణ్
జహీరాబాద్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి) : ఈ నెల 9న డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ తేదీ ముగిసిందని, అయితే చాలా మంది పేదలు దరఖాస్తు చేసుకోలేకపోయారని జహీరాబాద్ బిజెపి నాయకుడు అప్పం శ్రావణ్ అన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం మాట్లాడారు. అగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు తహశీల్దార్ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సెప్టెంబర్ 4 తేదీ వరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారులను తిప్పలు పెట్టారని ఆరోపించారు. అప్పటికే పుణ్యకాలం గడచిపోయిందన్నారు. మిగిలిన రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో భారీ వర్షాలు దేశమంతటా రెడ్ అలర్ట్ చివరి రోజుల్లో వర్షం పడిందని, తహశీల్దార్ కార్యాలయం వద్ద సరైన కౌంటర్ లేక సౌకర్యాలు లేక దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. కొద్ది మందికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడం వీలైందన్నారు. ఈ క్రమంలో అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు మరోమారు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్‌డీఓ, తహశీల్దార్‌లను శ్రావణ్ విజ్ఞప్తి చేశారు. పేదల ఇబ్బందులను అర్థం చేసుకోని అధికారులు స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.