ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి
` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు
న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న పరిస్ధితి. ఇక చల్లటి వాతావరణం కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ రానున్న అయిదురోజులు స్కూల్స్‌ను మూసివేస్తున్నట్టు ఢల్లీి ప్రభుత్వం ప్రకటించింది.ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలకు జనవరి 12 వరకూ సెలవలు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి అతిషి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్ధులకు చలి వాతావరణం కారణంగా రాబోయే ఐదు రోజులు ఢల్లీిలో స్కూల్స్‌ మూసివేస్తున్నట్టు అతిషి పేర్కొన్నారు.జనవరి 15న ప్రాధమిక తరగతుల విద్యార్ధులు తిరిగి స్కూల్‌కు వచ్చే అవకాశం ఉందని ఢల్లీి విద్యా ధాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్స్‌ తమ విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించవచ్చని ఉత్తర్వులు వెల్లడిరచాయి. చలి వాతావరణం దృష్ట్యా పాఠశాలలు ఉదయం 8 గంటలకు ముందు ప్రారంభం కావని, సాయంత్రం 5 గంటల తర్వాత తరగతులు నిర్వహించరని ఉత్తర్వులు స్పష్టం చేశాయి.