ఢల్లీిలో పెరిగిన కాలుష్యం..
` రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవు
న్యూఢల్లీి(జనంసాక్షి):పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా ఢల్లీిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను వచ్చే రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు ముఖ్యమం త్రి అరవింద్ కేజీవ్రాల్ నవంబర్ 2న రాత్రి ప్రకటించారు. జాతీయ రాజధానిలో కాలుష్య స్థాయిలు ఈ సీజన్‌లో మొదటిసారిగా తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశించాయి. దీంతో రాబోయే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్’లో పోస్టు చేసిన అరవింద్ కేజీవ్రాల్.. ‘పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా, ఢల్లీిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు రాబోయే 2 రోజుల పాటు మూసివేయబడతాయి’ అని తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్, పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా, నవంబర్ 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయిం చారు. అయితే, పాఠశాలలు ఉపాధ్యాయులు, సిబ్బంది కోసం మాత్రం పాఠశాలలు తెరిచే ఉంటాయని’ అధికారులు వెల్లడిరచారు.