ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు

న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీకి ఉ్నగవాద ముప్పు తప్పింది. పాత ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం రాత్రి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని ఆరెస్టు చేశారు. దీంతో పోలీసులు ఢిల్లీ ఉగ్రవాద దాడి ప్రయత్నాలను నిరోధించినట్లు భావిస్తున్నారు.
పోలీసులు గురువారం రాత్రి ‘జమా’ మసీదు సమీపంలోని ఓ అతిథి గృహంపై దాడి చేశారు. ఉగ్రవాదులుగా అనుమానం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా కాశ్మీరీలని తెలుస్తుంది. వారు ఉంటున్న గది నుంచి పోలీసులు పెద్దయెత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, ఎకె 47 రైఫిల్‌ను స్వాధీనం చేనుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత గదిని సీల్‌ చేశారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చేందిన లికాయత్‌ షా ఆచ్చిన సమాచారం మేరకు పోలీసులు రెండు రోజుల క్రితం గోరఖ్‌పూర్‌లో ఆరెస్టు చేశారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. హోలీ రోజు దాడులకు పాల్పడాలని వారు పథకం వేసుకున్నాట్లు తెలుస్తుంది. హోలీ మార్చి 27వ తేదిన ఉంది. గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేసిన లికాయక్‌ షా ను 15 రోజుల పాటు పోలిసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.