ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించిన అన్నా హజారే

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిన్న 15 మంది సభ్యుల కొత్త బృందాన్ని ప్రకటించిన అన్నా హజారే ఇవాళ ఢిల్లీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్వోదయ ఎన్‌క్లేవ్‌లో ఈ కార్యాలయం ప్రారంభిస్తూ ఆయన దేశాన్ని మార్చాలంటే పల్లెల్ని మార్చాలని గాంధీజీ అనేవారని గుర్తుచేశారు. డబ్బుతో ప్రజలను మార్చడం సాధ్యమైతే ఆ పని టాటా బిర్లాలు ఎప్పుడో చేసేవారని వ్యాఖ్యానించారు. జనవరి 30 నుంచి తమ బృందం దేశ పర్యటన ప్రారంభించి జనలోక్‌పాల్‌ బిల్లు తెచ్చేలా ప్రజల ద్వారా ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంచేస్తుందని అన్నా తెలియజేశారు.