ఢిల్లీలో గవర్నర్‌ బిజీ బిజీ

3

న్యూఢిల్లీ,జులై 25(జనంసాక్షి):ప్రధాని మోడీతో పాటు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌, ¬ంశాఖ కార్యదర్శితో సోమవారం  గవర్నర్‌ ఈసీఎల్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఇరువురిని కలిసినట్లు వెల్లడించారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోడీతో గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిమాణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ అనంతరం గవర్నర్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ వచ్చినందునే మోడీని కలిశానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపకాల విషయాన్ని కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ¬ంమంత్రి, న్యాయశాఖ మంత్రిని కూడా గవర్నర్‌ కలిశారు. అయితే హైకోర్టు విభజన తదితర అంశాలను చర్చించలేదన్నారు.