ఢిల్లీలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
న్యూఢిల్లీ: నగరంలోని సంగం విహార్ ప్రాంతంలోని బాత్రా ఆసుపత్రి వద్ద ఈ ఉదయం ఓ బస్సు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి, బస్సు బ్రేకులు విఫలమవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.