ఢిల్లీలో ప్రబలిన చికెన్ గున్యా : ఆరుగురు మృతి

న్యూఢిల్లీ : నగరంలో చికెన్ గున్యా వ్యాధి సోకి ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. వందల మంది ఆస్పత్రిపాలయ్యారు. పలు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. గత రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యాతో 180 మంది ఎయిమ్స్‌లో చేరారని వైద్యాధికారులు చెప్పారు. వీటితో పాటు వెయ్యి డెంగీ కేసులు, 21 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. దోమల మందులు కొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ నగరంలో లేరని విపక్షాలు ఆరోపించాయి.

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి కపిల్‌ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సాయం అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్‌కు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని అన్నారు. అన్ని పరిమితులను అధిగమించి ప్రజలకు సేవ చేస్తామని ఆయన అన్నారు. అలాగే పారిశుద్ధ్యంపై దృష్టి పెడతామని, దోమల బెడదను తొలగిస్తామని మంత్రి చెప్పారు.chikaen