ఢిల్లీ కాలుష్యపు కాసారం

2222
– పాఠశాలలు మూసివేత

– 3 రోజుల పాటు సెలవులు

దిల్లీ,నవంబర్‌ 6(జనంసాక్షి): వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని దిల్లీలో మరో మూడు రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్యాన్ని నివారించే చర్యలపై సవిూక్షించేందుకు ఆదివారం సీఎం కేజ్రీవాల్‌ తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతపై ఐదు రోజుల పాటు నిషేధం విధించారు. రోడ్లను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ ఉండాలని అధికారులకు సూచించారు. కాలుష్య నియంత్రణ కోసం గతంలో అమలు చేసిన సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. కొద్ది రోజుల పాటు నగరంలో ఎక్కడా ఎటువంటి వస్తువులను తగలబెట్టరాదని.. నిబంధనలు అతిక్రమించి తగలబెడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వాయు కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోయిందని కేజ్రీవాల్‌ శనివారం వ్యాఖ్యానించిన సంగతి అన్నారు. దిల్లీలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాలుష్యం పెరిగిపోయిందని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.