తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు

78x48h4wప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో కరెంట్ ఎకౌంట్ లోటు 8.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో జిడిపిలో సిఎడి 1.6 శాతానికి పరిమితమయ్యింది. 2013-14 ఇదే క్యూ3లో 4.2 బిలియన్ డాలర్లతో జిడిపిలో 0.9 శాతంగా చోటు చేసుకుంది. విదేశీ మారకం రాక పోకల మధ్య వ్యత్యాసమే ఈ కరెంట్ ఎకౌంట్ లోటు. క్యూ2లో సిఎడి 10.1 బిలియన్ డాలర్లతో జిడిపిలో 2 శాతంగా నమోదయ్యింది. దేశ చెల్లింపుల్లో తగ్గుదల సానుకూల అంశం వల్ల సిఎడి తగ్గుముఖం పట్టిందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 2014-15 ద్వితీయ త్రైమాసికంలో సేవల రంగం ఎగుమతులు పుంజుకోవడం కలిసి వచ్చిందని ఆర్‌బిఐ పేర్కొంది. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ తో ముగిసిన కాలంలో వాణిజ్య లోటు 39.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.