తట్టు,రూబెల్లా వ్యాధి నిర్మూలనకు కృషి
అయిజ (జనంసాక్షి)ఆగస్టు18 జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ నగర పంచాయతీ లోని ఠాగూర్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన తట్టు రూబెల్లా వంటి ప్రాణాంతక వ్యాధులను దూరం చేసే ఎమ్మార్ టీకాలను వేసే కార్యక్రమంలో నగరపంచాయతిలోని ఠాగూర్ ఉన్నత పాఠశాలలో ఎమ్మార్ వ్యాక్సిన్ లో పాల్గొన్న ఎంఈఓ గిరిధర్ మాట్లాడుతూ తొమ్మిది నెలల నుండి పదిహేను ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు ఉచితంగా ఇస్తారని చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఏకకాలంలో పోలియో టీకాల కార్యక్రమం చేపట్టడం వల్ల ఇప్పుడు పోలియో మహమ్మారి మాయమైందన్నారు.అదే స్ఫూర్తితో ఎంఆర్ ను టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.అన్ని ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలతో పాటు అంగన్ వాడి కేంద్రం ,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఇస్తారని చెప్పారు.ఈ కార్యక్రమం సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతుందని తెలిపారు. టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రరిమాణాలు ఉండవని భరోసా ఇచ్చారు.శ్రీరాముడు, హెచ్ ఎం కృష్ణ, కరస్పాండెంట్ తిమ్మప్ప, ఏఎన్ఎం లు ఎస్తేరమ్మ, రాధిక, చైతన్య, ఆశ కార్యకర్తలు సరళ, యేసమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.