తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన గద్వాల ఎమ్మెల్యే…

అధికారం కోల్పోతామనే భయంతో అసహనం…
– గద్వాల ఎమ్మెల్యే పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
 – నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్..
గద్వాల ప్రతినిధి నవంబర్ 23 (జనంసాక్షి):- గద్వాల నియోజకవర్గంలోని ప్రోటోకాల్ పాటించలేదని సంబంధిత అధికారిపై స్థానిక శాసనసభ్యులు దుర్భశలాడుతూ, గల్లా పట్టుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు…నిజంగా సంబంధిత అధికారి ప్రోటోకాల్ పాటించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవచ్చని అన్నారు. గతం నుండి ఎమ్మెల్యే యొక్క తీరు ఇలాగే ఉన్నదని గతంలో తన మామ అండదండలతో  అధికారులపై ఈ రకమైన దాడులకు పాల్పడమే గాక బెదిరింపులకు గురిచేశారని అదే తీరు ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాడని, ఎమ్మెల్యే తీరుతో అధికారులు ఈ జిల్లాలో పనిచేయడానికి వెనకాడుతున్న పరిస్థితి ఉన్నదని,దీనివల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
 మీరు పోటీ పడాల్సింది శిలాఫలకాలు పాతడానికో ప్రారంభం చేయడానికో కాదని  గద్వాల నియోజకవర్గం విద్యాపరంగా వెనుబాటుతనానికి గురైందని అనేక ప్రభుత్వ పాఠశాలలో అరకర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పై అధికారులతో, ప్రభుత్వంతో గట్టిగా నీలదీసి అభివృద్ధి చేయాలని అన్నారు…పేద వర్గాలు చూయించుకునే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు ఒక సంఘటన జరుగుతున్న కూడా ఇప్పటిదాకా సరైనటువంటి చర్యలు తీసుకోలేదని దాని పైన దృష్టి పెట్టాలని అన్నారు…అనేక అధికారిక కార్యక్రమాలలో బడుగు బలహీన వర్గాల నాయకుల పట్ల సరైన ప్రోటోకాల్ పాటించకుండా, గుర్తింపు ఇవ్వకుండా అవమానించారని మరి అప్పుడు గుర్తుకురాని ప్రోటోకాల్ అవమానము ఇప్పుడు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ బంగ్లా కుటుంబ నాయకుల తీరే అధికారులను,కాంట్రాక్టర్లను బెదిరించడమని రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెప్పి అధికారం నుంచి ఈ కుటుంబాన్ని దూరంగా నెట్టివేయాలని అన్నారు…ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు మల్దకల్ మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, నజుముల్లా,ధరూర్ మండల సమన్వయకర్త రంగస్వామి,గోపాల్,నాగర్ దొడ్డి కృష్ణ,మీసాల కిష్టన్న,గుండన్న,తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.