తప్పిపోయిన బాలికను క్షణాల్లో తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కెయూ పోలీసులు
గృహప్రవేశం కోసం అమ్ముమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తప్పి పోయిన ఐదు సంవత్సరాల బాలికను క్షణాల్లో తల్లిదండ్రులకు అప్పగించిన కేయూసి పోలీసులు.వివారల్లోకి వేళితే గృహప్రవేశం నిమిత్తం గోపాల్ పూర్ లోని అమ్ముమ్మ ఇంటికి తన తల్లిదండ్రులతో కల్సి హైదరాబాద నుండి ఐదు సంవత్సరాల బాలిక తన అమ్ముమ్మ ఇంటి ముందు స్థానిక పిల్ల లతో కలసి ఆడుతూ తన అమ్ముమ్మ ఇంటికి దూరం కావడంతో బాలిక తిరిగి ఇంటి వెళ్లేందుకు దారి మర్చిపోయి రోడ్డుపై నిల్చోని ఎడుస్తుండా అదే సమయంలో అ ప్రాంతానికి వచ్చిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ యుగంధర్, సతీష్ కుమార్ తప్పినపోయిన బాలికను వివరాలు అడగా బాలిక తల్లిదండ్రుల పేర్లు హైదరాబాదులోని స్కూల్ మాత్రమే తెలియజేయడంతో అప్రమత్తమైన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్లు బాలికను కెయూసి పోలీస్ తరలించి. తప్పి పోయిన బాలిక ఫోటోను వివిధ సామాజిక మాద్యాల్లో పోస్ట్ చేయడంతో ఈ సమాచారం విస్తృతంగా కావడంతో. ఇ సమాచారం పాప తల్లి తెలియడంతో సదరు బాలిక తల్లి కెయూసి ఇన్స్ స్పెక్టర్ జనార్థన్ సంప్రదించండంతో. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్లు తిరిగి బాలికను తల్లికి అప్పగించడంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తప్పినపోయిన తన కుమార్తెను క్షేమంగా తమకు తిరిగి అప్పగించినందుకు తల్లిదండ్రలతో పాటు బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్లు యుగేంధర్, సతీష్ కుమార్ తో పాటు కెయూసి ఇన్స్ స్పెక్టర్ జనార్థన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.