తప్పుచేసినట్లు ఆధారాలుంటే జైళ్లో పెట్టండి
న్యూఢిల్లీ, నవంబర్ 19 (జనంసాక్షి):
బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. తాను తప్పు చేసినట్లు తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే జైలులో పెట్టండి అంటూ సవాల్ చేశారు. ఆరు నెలల్లో విచారణ జరిపి వాస్తవాలు చెప్పండన్నారు. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం అని చెప్పారు.బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో గుండాలు ఉన్నరు. ఈ కారణంగానే వాళ్లను వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్‌గాంధీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంకోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసింది. మతంపేరిట దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో గుండాలు ఉన్నరు. ఈ కారణంగానే వాళ్లను మేం వ్యతిరేకిస్తున్నం. మా దగ్గర అనుభవం ఉంది. విూ దగ్గర ఉత్సాహం ఉంది. ఆ రెండింటిని కలపడమే తన ఉద్యోగమని రాహుల్ పేర్కొన్నాడు.