తమిళులకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి

MMM

– శ్రీలంకతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాం

-ప్రధాని నరేంద్ర మోడీ

కొలంబో,మార్చి14(జనంసాక్షి): తమిళులకు స్వయంప్రతి పత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పట్ల తిరిగి విశ్వాసం పెరిగిం దని, ప్రపంచంతో భారత్‌ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుం దని శ్రీలంకలో పర్యటిస్తున్న ప్రదాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్‌తో శ్రీలంక వాణిజ్య అసమతుల్యాన్ని సరిచేస్తామని కూడా పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా నానుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వా మ్య ఒప్పందం(సీఈపీఏ) కుదిరేలా ఇరు దేశాలు చొరవ చూపా లని ఈ సందర్భంగా మోడీ కోరారు. భారత్‌కు బలమైన ఆర్థిక భాగస్వామిగా మెలిగే శక్తి సామర్థ్యాలు శ్రీలంకకు ఉన్నాయని మోడీ అన్నారు. భారత ఆర్థిక పరిమాణం పట్ల శ్రీలంక ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని సంతులనం చేయడానికి చర్యలు తీసుకుంటానని, భారత మార్కెట్‌ను శ్రీలంకకు మరింత అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. శ్రీలంక దక్షిణాసియాలోనే భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అని అన్నారు.  2013-2014లో ఇరు దేశాల మధ్య 5.23 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల వాణిజ్యం జరిగితే శ్రీలంకకు బారత ఎగుమతులు 3.98 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు అయితే, భారత్‌కు శ్రీలంక ఎగుమతులు 678 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలో చివరి రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం  మధ్యాహ్నం ఆయన తలైమన్నార్‌ చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం తలైమన్నార్‌-మదు రైలు సర్వీసును జెండా వూపి ప్రారంభించారు. తరువాత ఆయన జాఫ్నా సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు.