తరగతులకు హాజరు కాని బాసర విద్యార్థులు
ఆందోళనలోనే ట్రిపుల్ ఐటి విద్యార్థులు
మంత్రి ఇంద్రకరణ్ ఏనాడు పట్టించుకోలేదన్న విమర్శలు
నిర్మల్,జూన్20(జనంసాక్షి): మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు షాకిచ్చారు. సోమవారం నుంచి విద్యార్థులు తరగతులకు హాజరవుతారని మంత్రి ప్రకటించినా విద్యార్థులు మాత్రం తరగతులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేదన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం సర్కార్ కసరత్తు ప్రారంభించింది. వీసీ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కవిూటీ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు వెంటనే యూనిఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో భేటి తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం.
గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో నడుస్తున్న వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం కోసం కసరత్తు ప్రారంభించింది. అలాగే వైస్ ఛాన్స్‌లర్ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసే అవకాశం ఉంది. విద్యార్థులకు వెంటనే యూనిఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఉన్నతాధికారులతో భేటి తర్వాత హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన జారీ చేయనున్నారు. ఇదిలావుంటే జిల్లా మంత్రిఇంద్రకరణ్ రెడ్డి ఏనాడూ సమస్యలు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏనాడూ ఇక్డకి విద్యార్థులతో సమస్యలపై చర్చించలేదని అంటున్నారు.