తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి

– బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ

, జూలై 12(జనంసాక్షి): తల్లిదండ్రుల  పెంపకం వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుమారులు కుమార్తెలు మనవళ్లు మనవరాళ్లు  తల్లిదండ్రులను వయోవృద్ధులను సాదకపోవడం వలన ఎంతోమంది అభాగ్యులు  ఆకలి కేకలు ఆర్తనాదాలు మధ్య అనాధ ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో, బస్టాండ్ లలో రోడ్ల వెంబడి, వీధి వీధిన తిరుగుతూ ఎంతో ప్రయాసపడుతూ ఎండనక వాననక ఆరోగ్యం లెక్కచేయకుండా బుక్కెడు అన్నం కోసం అనేక పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు చూడక పోవడం వలన అనారోగ్యానికి గురై  బస్టాండ్ లో రోడ్ల వెంబడి అనేకమంది తల్లిదండ్రులు వయో వృద్ధులు మతిస్థిమితం లేక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవ మాసాలు మోసి తన గర్భ స్థానాన్ని మనకిచ్చి కాళ్లతో తన్నుకుంటూ రక్తం చిందించకుంటు వచ్చిన మనం తల్లిని దేవతలా చూసుకోవాలని అన్నారు. అలాగే తండ్రి గుండెల మీద  తన్నుకుంటూ చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటూ పెరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని అమ్మమ్మ తాతయ్య నాయనమ్మలను కంటికి రెప్పలాగా సాధుకుంటేనే మన జన్మ ధన్యమవుతుందని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిఓ ఎంఎస్ నెంబర్ 10 తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తల్లిదండ్రులను వయోవృద్ధులను సాధకపోతె వారి ఆస్తిలో సగం వాటా అందుతుందని అన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ వారు అన్ని గ్రామాలలో ప్రచారం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు