తల్లీ… వెళ్లిరావమ్మా! “””””””””””””””””””””


పల్లవి;
బతుకమ్మ… బతుకమ్మ
మా “కంటి” వెలుగమ్మా
మా “ఇంటి” వేల్పమ్మా
మా చల్లని “తల్లి”వి నీవమ్మా… ఓ బతుకమ్మ
మా బతుకు”మెతుకే”నీవమ్మా.. మాబతుకమ్మ

చరణం:
బాధల తరుము “శక్తి”వి నీవు
బతుకు పాటల “శృతి”వి నీవు
పోరాటాల “స్ఫూర్తి”వి నీవు
త్యాగాల”మూర్తి”వి నీవమ్మా… ఓ బతుకమ్మ
తెలంగాణ “కీర్తి”వి నీవమ్మా … మా బతుకమ్మ
             !!బతుకమ్మ….
చరణం:
తీరొక్క రంగు పూలను ఏరి
ఒక్కో వరుస అందంగా తీర్చి
నడిమిట్ల గౌరమ్మను కూర్చి
భక్తి శ్రద్ధలతో పూజలు చేసి
బోనమెత్తి బైలెల్లేమమ్మా… ఓ బతుకమ్మా
అడపడుచులం ఆడిపాడేమమ్మా..బతుకమ్మ
               !!బతుకమ్మ…

చరణం:
సంస్కృతుల “ప్రతీక”  నీవు
శాంతి  సమైక్యతల “రూపం” నీవు
తెలంగాణ “ఆత్మ”గౌరవం నీవు
సిరిసంపదల”వరం”ఇవ్వమ్మ .. మా బతుకమ్మ
చల్లగా దీవించి వెళ్లి రావమ్మా ఓ బతుకమ్మ

               !!బతుకమ్మ….

                 “”””””'””””””
(బతుకమ్మ తల్లిని సాగనంపుతున్న సందర్బంగా…)

                      కోడిగూటి తిరుపతి
జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత
Mbl no: 9573929493

తాజావార్తలు