తహసిల్దార్ కార్యాలయం పలిమెలలో ఏర్పాటు చేయండి*
ఎంపీపి కుర్సం బుచ్చక్క*
, ఆగస్ట్ 29 (జనంసాక్షి)* పలిమెల మండలానికి చెందిన తహసిల్దార్ కార్యాలయాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎంపీపి కుర్సం బుచ్చక్క కలెక్టర్ ని కోరారు. మండలం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలు మండల కేంద్రంలో ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ కు వివరించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయం కోసం మహదేవపూర్ వెళ్లాల్సి వస్తుందని, ఖర్చుతో కూడుకున్న ఇబ్బందే కాకుండా ఇతర ఇబ్బందులకు గురి అవుతున్నారని వివరించారు. కలెక్టర్ తక్షణమే స్పందించి పలిమెల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి బుచ్చక్క వెంట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దందెర రాజేందర్ ఉన్నారు.