తాండూరులో భారీ వర్షం

రంగారెడ్డి,మార్చి9 : తాండూరులో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం సోమవారం దాకా ఎడతెరపి లేకుండా కురిసింది. విద్యుత్‌ తీగలు, చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలచిపోయింది. రోడ్లవిూద పెద్ద ఎత్తున వర్షం నీరు పారింది. మురుగు కాలువలు వర్షం నీటితో పొంగి వరదలా పారాయి. వర్షం ధాటికి రోడ్లు గుంతలు పడ్డాయి. పె/-దదెముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి వద్ద వాగు పొంగడంతో హైదరాబాదు తాండూరు వద్ద రాకపోకలు నిలచిపోయాయి. త్రీవ వర్షం కారణంగా జొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. వికారాబాద్‌లో కూడా  ఎడతెరిపిగా వర్షం కురుస్తుంది. వర్షపాతం భారీ స్థాయిలో నమోదయ్యింది. ఆదివారం అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తునే ఉంది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి మట్టిరోడ్లు అని బురదమయమై స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.