తాగునీటి సమస్యలపై దృష్టి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి లోగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లా నీరు అందించాలని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రంగినేని మనీషా సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో ఇంటింటికీ నల్లా బిగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. పైప్‌లైన్‌ కోసం తవ్విన గుంతలను పనులు పూర్తి కాగానే పూడ్చివేయాలన్నారు. కాలనీవాసులు, మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇప్పించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలనీలో అభివృద్ధి పనులు చేస్తున్నదని అన్నారు.