తాగునీటి సరఫరా , లో ప్రెషర్ సమస్య పరిష్కరించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*
నాచారం(జనంసాక్షి): మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలో రజక బస్తీ కాలనీలో గత సంవత్సర కాలంగా తాగునీటి సరఫరా సమస్య, లో ప్రెషర్ సమస్య విషయంపై కాలనీవాసుల పిర్యాదు నిమిత్తం జల మండలి సిబ్బంది సహాయంతో పరిష్కరించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఎన్నికల సమయంలో కాలనీవాసులకు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ జిఎం జాన్ షరీఫ్, డీజిఎం సతీష్, ఏజిఎం వేణుగోపాల్ , స్థానిక నాయకులు బాలనర్సింహ, మల్లారెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.