తాహశీల్దార్ కార్యాలయం నిర్బంధన
బషీరాబాద్ అక్టోబర్ 10, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున తాహశీల్దార్ కార్యాలయలయని మండల వీఆర్ఏలు నిర్బంధన చేశారు. ఈ నిర్భంధన కార్యక్రమంలో వల్లన మధ్యాహ్నం వరకు బయటనే నిలిచిన అధికారులు తహశీల్డార్ ఎన్. వెంకట్ స్వామి, డిప్యూటీ తహశీల్డార్ వీరేశం బాబు, అర్.ఐలు, కంప్యూటర్ సిబ్బంది బయటనే నిలిచిన పోయారు. మధ్యాహ్నం తర్వాత యధావిధిగా విధులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు మాట్లాడుతూ సమ్మెలో ఇప్పటికి 78 రోజులు గడిచిన ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు తహశీల్డార్ కార్యాలయం దిగ్బంధన చేయడం జరిగిందని అదేవిధంగా ఎంతో మంది వీఆర్ఏలు మరణించిన కూడా స్పష్టమైన స్పందన టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం ఇప్పటికీ మేము ఆర్థిక పరంగా మరియు మానసిక పరం కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటేనే మా డిమాండ్లు తీర్చాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అంజీలప్ప,ఉపాధ్యక్షులు నర్శీములు, కార్యదర్శి శ్రీశైలం, కోశాధికారి హైమధ్, అశోక్, చంద్రయ్య,రాజమణి, వివిధ గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.