తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల

జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముంచెత్తుతోంది. శనివారం టీబీ డ్యాంకు 98,644 క్యూసెక్కుల ఇన్‌ ప్లో వచ్చి చేరుతోంది. అవుట్‌ ప్లో 216 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 73.939 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1624.21 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు వరద తీవ్రత పెరిగి టీబీ డ్యాంకు ఇన్‌ ఎª`లో భారీగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నేడో.. రేపో డ్యాం గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తుంగభద్ర బోర్డ్‌ అధికారులు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ హెచ్చరికలు జారీ చేశారు.