*తుతు మంత్రంగా మండల సర్వ సభ సమావేశం*

పెబ్బేరు జనంసాక్షి న్యూస్:  సమస్యలపై చర్చించి ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేయవలసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం సమావేశానికి డుమ్మా కొట్టడంతో ముగ్గురు ఎంపీటీసీ లు, నలుగురు సర్పంచ్ లతో మండల పరిషత్ వైస్ చైర్మన్ బాల చంద్రారెడ్డి  అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అధికారులు లేకపోవడంతో ప్రజా ప్రతినిధులు అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ, అబ్కారీ శాఖ, ఫారెస్ట్ శాఖ,ఆర్ అండ్ బి శాఖ ల అధికారులు అసలు ఏ సమావేశానికి ఎందుకు హాజరు కవడలేదని ప్రశ్నించారు.
మండల పరిషత్ కో అప్షన్ సభ్యులు సత్తార్   మండల కేంద్రం నుండి సుగూర్ వెళ్ళే ప్రధాన రోడ్డు  బునియది పురం సూగూర్ మధ్య  రోడ్డు కల్వర్టు  రంధ్రం పడి 15 రోజులు అవుతోంది అయినా ఆర్ అండ్ బి  అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, విజయ లక్ష్మి, ఎంపీటీసీలు వేణుగోపాల్, రామచంద్రమ్మ సర్పంచులు స్వాతి, సుజాత, రాజవర్ధన్ రెడ్డి, గట్టయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.