తుదిదశకు చేరుకున్న బీమా వివరాల సేకరణ

మెదక్‌,జూలై28(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బీమా కార్యక్రమం పూర్తి దశకు చేరుకున్నదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం అన్నారు. జిల్లాలో రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 78 శాతం పూర్తి అయ్యిందని, మిగిలిన 22 శాతాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జూలై నెలాఖరులోగా రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆగస్టు మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు.

—————-