తుపాకితో బెదిరింపులు

నల్గొండ, : గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో తుపాకితో ప్రజలను బెదిరిస్తూ ఇద్దరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి గ్రామానికి చెందిన కొందరిని బెదిరించారు. బైక్‌పై వచ్చిన వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన గొలుసు దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.