తుఫాన్‌ గండం

దూసుకొస్తున్న రెమాల్‌..
ప్రధాని మంత్రి అత్యవసర సమీక్ష
న్యూఢల్లీి (జనంసాక్షి)
బంగాళఖాతంలో రెమల్‌ తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరో ఆరు గంటల్లో రెమల్‌ తుపాను తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రెమల్‌ తుఫాన్‌ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ ఉండనుంది. ఇప్పటికే ఈ తుపాను వల్ల పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లా యంత్రంగాలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడిరది. దీంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. రెమాల్‌ తుఫాను మరింత తీవ్రం రూపం దాల్చి ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంతాలను తాకనుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను తీవ్రతను తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. ప్రాణనష్టం జరక్కుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.