తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
మెదక్(జనం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నార్సింగ్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన బోళ్ల సురేశ్, సింగరబోయిన సంతు, అందె రాజుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తూప్రాన్ టోల్‌గేటు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.