తెదేపా కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదు

అలా జరిగితే ఉరేసుకుంటా
రాజీనామాలతో వైసీపీ డ్రామాలాడుతుంది
డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి
కర్నూలు,జూన్‌6(జ‌నం సాక్షి): గ్రెస్‌తో తెదేపా కలిసే ప్రసక్తే లేదని, అలా జరిగితే తాను ఉరేసుకుంటానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ వైసీపీ రాజీనామాల పేరుతో నాటకాలు ఆడుతోందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీజేపీతో వైసీపీ కుమ్మక్కై రాజీనామాల వ్యవహారాన్ని నాన్చుతున్నారని ఆరోపించారు. బీజేపీ పంచన చేరిన వైసీపీకి 2019లో పుట్టగతులు ఉండవని కేఈ అన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని కుప్పిగంతులు వేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీని విమర్శించాలని జగన్‌, పవన్‌ పనిగా పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుట్ర రాజకీయాలకు వైసీపీ, బీజేపీలు పాల్పడుతున్నాయని, లోపాయికారి ఒప్పందాలతో రాష్ట్రంలో తెదేపాను ఓడించే ప్రయత్నంలో ఆ రెండు పార్టీలు ఉన్నాయన్నారు. వాటికితోడు జనసేన కూడా వారి కూటమిలో తోడైనట్లు కనిపిస్తుందని కేఈ ఆరోపించారు. ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేంద్రం నుంచి బయటకొచ్చి మరీ చంద్రబాబు ఓ పక్క పోరాడుతుంటే మరోపక్క బీజేపీతో కలిసి వైసీపీ, జనసేన పార్టీలు చంద్రబాబుపై ఆరోపణలు చేయం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పవన్‌ కళ్యాణ్‌కు రాష్ట్రంలో కానరాని అవినీతి బీజేపీతో, కేంద్రంతో తెగదెంపులు చేసుకున్న తరువాత కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఎవరెన్న కుట్రలు పనిన్ని తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని కేఈ పేర్కొన్నారు.