తెరాస,వైకాపా నేతల మధ్య ఘర్షణ
వరంగల్: తెరాస, వైకాపా నేతల ఆందోళనలతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం తెరాస కార్యాలయం ముందు వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికీ ప్రతిగా వైకాపా కార్యాలయం ముందు తెరాస నిరసనకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు.