తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట

హైదరాబాద్‌ : గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ అవరణలో ఆందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన అనంతరం గోల్కోండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గోల్కోండ పీఎస్‌లో తెరాస ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. మాక్‌ అసెంబ్లీకి అడ్డుకోవడంతో పోలీసులు, ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది.