తెరాస మండల అధ్యక్షుడిగా మహాలక్ష్మీ వెంకటనర్సయ్య
ఖానాపురం అక్టోబర్ 14 జనం సాక్షి
తెరాస (బిఆర్ఎస్ ) పార్టీ మండల అధ్యక్షుడిగా బుధరావుపేట గ్రామానికి చెందిన మహాలక్ష్మీ వెంకట్రాంనర్సయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా ఓడీ సీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఎంపిపి వేములపల్లి ప్రకాష్ రావు,శుక్రవారం తెరాస మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట్ రామ్ నర్సయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా తక్కలపెల్లి రమేష్, కొంకటి నర్సిరెడ్డి, జలగం బాబు, నీలారపు నరేందర్,రెడ్డి నాగార్జున్ రెడ్డి,భూక్య వెంకన్న,ప్రధాన కార్యదర్శిగా బండి వెంకన్న, కార్యనిర్వహణాధికారిగా సుధాకర్,కోటి,రాజేశ్వరరావు,వెం కటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు గా అయిలయ్య, సోమయ్య, గులాం బాబా,దేవేందర్, ప్రచార కార్యదర్శులుగా కిరణ్, తిరుపతి రెడ్డి, కర్ణాకర్, కృష్ణారావు,సుమన్ యాదవ్, కోశాధికారిగా సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా ఉపేందర్, రవి,రమేష్, లక్ష్మీనారాయణ, రాజు, నిమ్మ,శీను,ఈర్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వెంకట్ రెడ్డి, జెడ్పిటిసి బత్తిన స్వప్న శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area