తెర్కంపల్లి తాండాలో వర్ష బీభత్సం వల్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి.
తాండూరు: బుధవారం రాత్రి గాలి-వాన బీభత్సం కారణంగా యాలాల మండలం తెర్కంపల్లి తాండాలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నాలుగు ఇళ్లుపాక్షికంగా దెబ్బతిన్నాయి. తాండాలో కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్ నేలకూలింది. రైతులు సాగుచేసిన 40 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ , విద్యుత్తు సిబ్బంది గురువారం గ్రామాన్ని సందర్శించారు. సహాయక చర్యలు చేపడతామని తాండ వాసులకు హామీ ఇచ్చారు.