తెలంగాణకు అన్నింటా అన్యాయమే
హరీశ్‌రావు ఫైర్
అవిశ్వాసంపై చర్చ ప్రారంభించిన టిఆర్‌ఎస్ ఉపనేత హరీష్ రావు తన సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని, ఐదేళ్ల పాలన కోసం ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అందుకే తాము అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణకు
జరిగిన, జరుగుతుతన్న అన్యాయాలను, కేటాయింపుల్లో వివక్షను ఆయన తన ప్రసంగంలో సోదాహరణంగా వివరించారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడం వల్లనే కాంగ్రెస్ గద్దెనెక్కగలిగిందన్నారు. తెలంగాణ రాషట్‌రసమితి పొత్తు కారణంగానే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందన్నారు. రైతులకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం హావిూ ఇచ్చిందని అన్నారు. వ్యవసాయానికి 9 గంటలు కాదు కదా.. కనీసం 7 గంటల విద్యుత్ ఎప్పుడొస్తుందో చెప్పగలరా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిల్లులు కట్టకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం బాధాకరమైనా.. తప్పడం లేదని అన్నారు. తెలంగాణ కోరిక రాజకీయ డిమాండ్ కాదని.. ఈ ప్రాంత ప్రజల తరతరాల వాంఛ, ఎడతెగని పోరాటమని వివరించారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వాలు, పార్టీల విూద కాకుండా పోరాటంపైనే నమ్మకముందని చెప్పారు. ఆంధ్రా ప్రాంతంలో తెలంగాణ విలీనమైన నాటి నుంచే ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతూనే ఉందని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజల జీవితాలతో సీమాంధ్ర సర్కార్ చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. జీవో 36, జీవో 610 జీవోలను సీమాంధ్రులు తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రుల ఆధిపత్యంతో తెలంగాణ ప్రజల దుర్బరమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌పార్టీ మోసాలకు పాల్పడుతూనే ఉందని హరీష్‌రావు అన్నారు. 1969లో కూడా మోసం చేసిందన్నారు. డిసెంబర్ 9న పార్లమెంట్‌లో తెలంగాణ ఇస్తామని కేంద్ర ¬ంమంత్రి చేసిన ప్రకటనను డిసెంబర్ 23న యూటర్న్ తీసుకుని మరోసారి తెలంగాణ ప్రజలను వంచించిందని ఆవేదనతో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ- పేరుతో అధ్యయనం చేయించిందని, అయితే ఆకమిటీ- ఎంత బోగసో దాని రీతేంటో, నీతేంటో సుప్రీంకోర్టు తేల్చిందని గుర్తు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దోపిడీకి గురైంది తెలంగాణ ప్రాంతమే అని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన 610 జీవో కూడా నేటికి అమలు కాలేదని అన్నారు. ‘మా లక్ష్యం, మా గమ్యం తెలంగాణ రాష్ట్ర సాధనే’ అని హరీష్‌రావు అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా తమ ఆస్తిత్వ పోరాటం కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష కొనసాగుతూనే ఉందని తెలిపారు. ‘తుపానుకు పక్షి భయపడదు.. తన రెక్కలను తాను నమ్ముకుంటుందిగాని చెట్టు కొమ్మలను కాదు’ అని వివరించారు.కాంగ్రెస్ పార్టీది ద్రోహాల చరిత్ర అని హరీష్‌రావు విమర్శించారు. ద్రోహంకన్నా ముందే కాంగ్రెస్ పుట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో కాంగ్రెస్ పార్టీకి అంత
మోసాల చరిత్ర ఉందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తరతరాలుగా కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు.