తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

– హైదరాబాద్‌, వరంగల్‌ మినహా అన్ని వెనుకబడిన ప్రాంతాలే
– ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు హోదా ఇవ్వాల్సిందే
– కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి
– విలేకరుల సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్గొండ, జులై25(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక ¬దాను ప్రకటించాలని, తెలంగాణ హైదరాబాద్‌, వరంగల్‌ మినహా అన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురైన ప్రాంతాలేనని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుత్తా మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు వంచించడం చేతకాదని, అందుకే ప్రతీసారీ మోసపోతున్నామని  గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌ మినహా మిగిలిన ప్రాంతమంతా వెనుకబడిందేనని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సమగ్రంగా వివరిస్తూ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలకు లేఖ రాశానని గుర్తు చేశారు. అన్ని వనరులతో అభివృద్ధి చెందిన ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. వెనుకబడిన తెలంగాణకు కూడా ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. ఏపీలో పోలవరంను జాతీయ
ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర నిర్మాణం చేపడుతుందని, కానీ తెలంగాణ కాళేశ్వరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవటం విచారకరమన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ¬దా కల్పిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తోంటే తెలంగాణ గురించి మాట్లాడకుండా ఏం చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను గుత్తా ప్రశ్నించారు. విభజన చట్టం హావిూలు నెరవేర్చాలని ఎంపీలు అడగలేక పోవడానికి కారణాలేంటో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా నోరు తెరచి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఏపీకి వత్తాసు పలుకుతూ ప్రత్యేక ¬దా ఏపీకి ఇవ్వాలని కోరుతుండటం చూస్తుండే విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరాల్సిందిపోయి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతుండటం సిగ్గుచేటన్నారు.