*తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే క్షేమం*

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మునగాల, సెప్టెంబర్ 19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే క్షేమమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య అన్నారు. సోమవారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ మూల వెంకటరెడ్డి,  నాయకులు సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ కండువగప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీల నుండి చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలవుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, టిఆర్ఎస్ పార్టీకి  తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రంగ ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు సురగాని రాంబాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి లచ్చిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బేతం చిన్నారెడ్డి, మండల ఉపాధ్యక్షులు గోపిరెడ్డి నాగిరెడ్డి, నాయకులు సోమిరెడ్డి వీరారెడ్డి, గడ్డం లింగయ్య, మంగయ్య, సాగర్, కపిల్ రెడ్డి, జగన్నాథం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.