తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్
హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్ అన్నారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలూకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్, తెలంగాన ప్రజలను పూర్తిగా మోసం చేసిందన్నారు. చివరకు టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కేసీఆర్ సిద్దమైనా రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం కాంగ్రెస్ అంగీకరించలేదన్నారు. మరో వైపు తెలంగాణపై నోరెత్తకుండా అధిష్టానం భజన చేసిన వారికి కేంద్రమంత్రి పదవులు కల్పించి తన నైజాన్ని చాటుకుందన్నారు.