తెలంగాణచంద్రబాబు రేవంత్‌

సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్‌
రాజగోపాల్‌ రెడ్డి చేరికను తట్టుకోలేని రేవంత్‌
మండిపడ్డ బిజెపి నేతల డికె అరుణ

హైదరాబాద్‌,అగస్టు3(జనం సాక్షి ):రేవంత్‌ రెడ్డిని తెలంగాణ చంద్రబాబుగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగినోడి లెక్క రేవంత్‌రెడ్డి మాట్లాడం హాస్యాస్పదమని.. తన భాష మార్చుకోవాలని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరనుండటం రేవంత్‌ రెడ్డి జీర్ణించుకోలేపోతున్నాడని..అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమం లో సోనియా, రాహుల్‌ పై రేవంత్‌ చేసిన కామెంట్స్‌ వీడియోను ఆమె ప్లే చేసి చూపించారు. సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించిన రేవంత్‌ మాటలను ప్రజలు మర్చిపోలేదన్నారు. దేశ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిందని..బీజేపీని మాత్రమే ప్రజలు నమ్ముతున్నారని డీకే అరుణ అన్నారు. ఈడీ, సీబీఐలతో వేధించి ఎంతోమందిని జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌ది అని అన్నారు. అమిత్‌ షాను గుజరాత్‌ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీం తప్పుబట్టిన సంగతి రేవంత్‌ తెలుసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దొడ్డిదారిన కాంగ్రెస్‌ లో చేరిన చరిత్ర రేవంత్‌ రెడ్డిదని
విమర్శించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనన్న విషయం రాష్ట్రపతి ఎన్నికలతో రుజువైందన్నారు. తెలంగాణను ఏర్పాటును కాదు..రాష్ట్ర విభజన తీరును మాత్రమే మోదీ పార్లమెంట్‌ లో తప్పుబట్టారని తెలిపారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కాంగ్రెస్‌ ది అని డీకే అరుణ అన్నారు. హుజురాబాద్‌ మాదిరి మునుగోడులో కాంగ్రెస్‌ కు డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతోందని మునుగోడు ప్రజలు నమ్ముతున్నారు. సింపతి కోసమే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమపై హత్యాప్రయత్నాలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఓటమి భయం అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వేధిస్తోంది

తాజావార్తలు