తెలంగాణను ఆదుకోండి

5

– కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి):

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో టీఆర్‌ఎస్‌ ప్రతినిధిబృందం భేటీ అయ్యింది.  భేటీలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ అదేవిధంగా ఎంపీలు కె.కవిత, జితేందర్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రుడు, వేణుగోపాలచారిలు పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా టీఆర్‌ఎస్‌ బృందం రాష్ట్రంలో కరువు పరిస్థితులపై మంత్రికి వివరించారు. అంతకు క్రితం పత్తికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ కేంద్ర జౌలిశాఖ సహాయమంత్రి గంగ్వార్‌ను కలిశారు.  రైతుకు సమస్య రాకుండా చూడటమే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర జౌలిశాఖ సహాయమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ అన్నారు. పత్తికి కనీస మద్దతు ధర కోరుతూ టీఆర్‌ఎస్‌  బృందం సంతోష్‌ గంగ్వార్‌ను కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పత్తి రైతుల సమస్యలను మా దృష్టికి తెచ్చారని అన్నారు. అయితే పత్తి ధరను మేము నిర్ణయించలేమన్నారు.  ధర నిర్ణయించడంలో మా పాత్ర తక్కువగా ఉంటుందని, పత్తి ధర వ్యవసాయశాఖ పరిధిలోని కమిటీ నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. అయితే  రైతులకు సమస్య రాకుండా చూడటమే తమ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. సమావేశానంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ పత్తి రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరినట్లు  తెలిపారు. పత్తికి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ బృందం నేడు కేంద్ర జౌలిశాఖ సహాయమంత్రి, ఆ శాఖ కార్యదర్శిని కలిశామని తెలిపారు. భేటీ అనంతరం కడియం శ్రీహరి సమావేశ వివరాలను విూడియాకు వివరించారు.  పత్తికి కనీస మద్దతు ధర పెంచాలని విజ్ఞప్తి చేశామని,  క్వింటాకు రూ. 5 వేలు ఇస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో చెప్పారని అన్నారు. పత్తి మద్దతు ధర రూ. 5 వేలకు పెంచి రైతులను ఆదుకోవాలని గట్టిగా కోరామన్నారు. పత్తి ధర వ్యవసాయశాఖ పరిధిలోని కమిటీ నిర్ణయిస్తుందన్న మంత్రి ధర నిర్ణయించే కమిటీకి మా విజ్ఞాపనలు ప్రతిపాదిస్తామని చెప్పారు. అదేవిధంగా అన్ని మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. కీనసం వారంలో ఐదురోజులు పత్తిని కొనుగోలు చేయాలని కోరామన్నారు. ఇకపోతే సాయం చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరువు నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు అందించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం మంత్రిని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించామన్నారు. సమావేశం అనంతంర మంత్రి పోచారం వివరాలను వెల్లడిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో 2015లో కరువు తీవ్రంగా ఉందని, మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ ప్రాంతాల్లో కరువు ఉందన్నారు. జిల్లా కలెక్టర్ల నివేదిక ప్రకారం 231 మండలాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ కరువు నివేదికను కేంద్రమంత్రికి అందించినట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని మంత్రి హావిూ ఇచ్చారని పోచారం తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రోజువారి భృతి, మంచినీటి కోసం దాదాపు రూ. 2,514 కోట్లు ఇవ్వాలని కోరాం. ఈ క్రమంలో హార్టికల్చర్‌ రెండో విడతలో భాగంగా రూ. 75 కోట్లు ఇస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. హార్టికల్చర్‌ యునివర్సిటీకి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్రానికి రావాల్సిందిగా చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. జనవరి 7న హార్టికల్చర్‌ యూనివర్సిటీకి  మంత్రి చేతుల విూదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడిం