తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం గర్వకారణం: కేటీఆర్
సంగారెడ్డి: తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను మంత్రులు కేటిఆర్, పోచారం శ్రీనివాసురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వ్యవసాయంలో టెక్నాలజీ వాడుతున్నామని, సామాన్యుడికి టెక్నాలజీని అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కరెంట్ కోతలను అధిగమించామని, వ్యవసాయానికి పగలు 9 గంటల కరెంట్ ఇస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.