తెలంగాణలో ఇరవై నాలుగుగంటల కరెంటు అందించిన ఘనత. బి అర్ యస్ ప్రభుత్వం దే ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

జులై17 (జననం సాక్షి) ముడుగంటల కరెంటు కావాలా
24 గంటల కరెంటు కావాలా చీకట్ల కాంగ్రెస్ కావాలో
కరెంటు వెలుగుల బిఆర్ఎస్ కావాలో తెలంగాణ రైతులు తేల్చుకోవాలి రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదిక లో రైతులతో సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని రైతు వేదిక నందు నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు రైతులు మాట్లాడుతూ
గతంలో కరువు కాటకాలకు నిలమైన ఈ ప్రాంతంలో సరైన నీటి సౌకర్యం లేక రైతులకు నాణ్యతమైన విద్యుత్ లేక మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. నీరు కరెంటు లేక పంటలు పండేది కాదు ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా బతికే వాళ్ళం కొంతమంది రైతులు పండించిన పంట సరైన గిట్టుబాటు ధర రాక పంట నష్టం జరిగితే తమ ప్రాణాలను కోల్పోయేవారు ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో జరిగినది.
ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ తొమ్మిదేళ్లలో రైతులకు వ్యవసాయం పండించుకోవడానికి ఇరవైనాలుగు గంటల ఉచిత కరెంటు అందిస్తూ పెట్టుబడికి రైతుబంధు రూపంలో సహాయం అందజేయడం జరుగుతుంది. అన్నారు రైతులు పంటలు పండించుకోవడానికి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించడం జరుగుతుంది . రైతులకు ఫర్టిలైజర్ ను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది.
రైతుల పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఖాతాలో డబ్బులు చేయడం జరుగుతుంది. అనుకోకుండా రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నది ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న మాటను వెంటనే వెనక్కు తీసుకోవాలి రైతులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని గద్వాల రైతాంగం తరపున కోరడం జరుగుతుంది అని. ఎమ్మెల్యే అన్నారు
ఎమ్మెల్యే బండ్లకృష్ణమెహన్ రెడ్డి మాట్లాడుతూ.
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది గతంలో గత ప్రభుత్వాలు గత పాలకులు రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయలేదు. రైతులకు కోసం లాంటి నీటి సౌకర్యము విద్యుత్ సౌకర్యం అందించే లేదు. గతంలో విద్యుత్ రెండు మూడు గంటలు మాత్రమే ఉండేది. రైతులు భార్య పిల్లలను వదిలేసి పొలాలకు నీళ్లు కట్టడానికి పొలాల దగ్గరనే రాత్రిపూట నిద్రపోయే వారు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అని ఎదురు చూస్తూనే వారు సరిగ్గా పంట పండగ నష్టాలను ఎదుర్కొనేవారు. కొంతమంది రైతులు అప్పుల బాధ భరించాక ఆత్మహత్యలు చేసుకునేవారు.
కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు బాంధవుడు కేసీఆర్ రైతుల కోసం రైతులకు పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి రెండు పంటలకు పదివేల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.అన్నారు అదేవిధంగా రైతులకు పుష్కలమైన సాగునీరును అందించడం జరుగుతుంది. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం జరుగుతుంది. దీనితోపాటు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించడం జరుగుతుంది. సబ్సిడీకి ఫర్టిలైజర్ లను కూడా ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది రైతులు పండించిన ప్రతి దాన్యమును ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది.

రైతుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులు కూడా ఆత్మ గౌరవంగా బతకాలని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతుల యొక్క సమస్యలను సాధకబాదాకాలను తెలుసుకోవడానికి ఒక వేదిక ఉండాలని రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగినది తెలిపారు.

నేడు రైతులు పంటలను పండించుకోవడం జరుగుతుంది పొలాల దగ్గర ఏ సమయంలో అయినా వెళ్లి రైతులు ఎలా పొలాలకు నీళ్లు పట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు నేడు ఆత్మ ధైర్యంతో బతకడం జరుగుతుంది.

రైతు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంటే ఆర్థికంగా ఎదుర్కొంటే చూసి ఓర్వలేక రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగినది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులను రైతులను గురి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు అభివృద్ధి చెందుస్తుంటే చూసి మరొక్కసారి రైతులను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మన ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి రైతులంతా అప్రమత్తంగా ఉండాలి మూడు గంటల కరెంటు మాకు వద్దు కేసిఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంటు మాకు కావాలని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న కు బిఆర్ఎస్ పార్టీ సీఎం కే సిఅర్ ఎల్లప్పుడు అండగా ఉంటారని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎంపీపి విజయ్ కుమర్ పి ఎసియస్ ఛైర్మన్ క్యామవెంకటేష్, గట్టు మండలం పార్టీ అధ్యక్షుడు & రైతు బంధు సమితి అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ, కో ఆప్షన్ నెంబర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామాంజనేయులు, గద్వాల తిమ్మప్ప, అంగడి బసవరాజ్, బజారి ,రాము, ఆలీ, సురేష్, హనుమంతు రెడ్డి, వెంకటన్న గౌడ్ , శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, తిమ్మప్ప, మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు