తెలంగాణలో ఎన్నికల సంఘం పర్యటన
` ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు
హైదరాబాద్ బ్యూరో (జనంసాక్షి):ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడురోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటిస్తారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధతను ఈ సందర్భంగా అధికారులు నిర్ధారించుకుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. మూడు రోజుల పర్యటనకోసం కొందరు అధికారులు సోమవారమే హైదరాబాద్ చేరుకోగా.. మిగిలినవారు ఈరోజు నగరానికి వస్తారు. ప్రధానంగా ఎన్నికల్లో అక్రమ డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు వీరు రాష్ట్ర అధికారులతో కలసి నిర్ణయాలు తీసుకుంటారు. బోగస్ ఓట్లపై కూడా దృష్టిపెట్టే అవకాశముంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు చేపట్టే చర్యలపై చర్చిస్తారు. ఇదీ షెడ్యూల్.. ఈరోజు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారులు సమావేశం అవుతారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 20 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల ఉన్నతాధికారులతో చర్చిస్తారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి పోలీసు నోడల్ అధికారి, సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం ఉంటుంది. ంశ్రీబనీ ఖీవజీట ` తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది.. నిజామాబాద్‌లో పీఎం నరేంద్ర మోడీ బుధవారం ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు వంతెన వద్ద ఓటరు చైతన్యం కోసం సైకిల్ థాన్, వాక్ థాన్ ఏర్పాటు చేస్తారు. అనంతరం 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఓటర్ల జాబితా, పోలింగు కేంద్రాలు, బందోబస్తుపై జిల్లాల వారీగా సవిూక్ష నిర్వహిస్తారు. గురువారం ఉదయం 9.15 నుంచి 10 గంటలవరకు గచ్చిబౌలిలోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఎన్నికల ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. చివరిగా గురువారం తెలంగాణ సీఎస్, డీజీపీలతో సమావేశం అవుతారు. అదేరోజు తిరిగి ఢల్లీి బయలుదేరి వెళ్తారు.