తెలంగాణలో ఐదు స్మార్ట్‌ సిటీలు

4
హైదరాబాద్‌/న్యూఢిల్లీ మే1 (జనంసాక్షి): ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్‌ సిటీల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం

100 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే తొమ్మిది ఎంపిక కావడం గమనార్హం. ఏపీ నుంచి కర్నూలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరులను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.గత సంవత్సరంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా 100 స్మార్ట్‌ సిటీలను ఎంపిక

చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తం 100 నగరాలను అభివృద్ధి చేసేందుకు రూ. 6వేల కోట్లను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం వెచ్చించనుంది.