*తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల*
:-తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈసారి మొత్తం 2,861 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలులు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. వారిలో 5,08,110 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 1,165 మంది ప్రైవేట్ విద్యార్థులు. 2,861 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 33,000 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నారు. అలాగే రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలు, 144 ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు ఈ ఫలితాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇటీవల ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటగా.. టెన్త్ ఫలితాల్లోనూ అమ్మాయిలే మెరుగైన ఫలితాలు సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. టెన్త్ ఫలితాల్లో అబ్బాయిలు 87.61 శాతం, అమ్మాయిలు 92.45 శాతం పాస్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 5,03579 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,53201 మంది విద్యార్థినీ విద్యార్థులు పాస్ అయినట్లు స్పష్టం చేశారు. ఈ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా టాప్ ప్లేస్లో ఉండగా.. హైదరాబాద్ లాస్ట్లో నిలిచింది. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.