తెలంగాణలో పెట్టుబడులకు చైనా ఆసక్తి

4
– సీఎం కేసీఆర్‌తో బీజింగ్‌  రాయబారి భేటి

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా చైనా కంపెనీలు ఆసక్తి చూపించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇటీవల తాను చైనా సందర్శించిన సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానని గుర్తుచేశారు. హైదరాబాద్‌ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో తనను కలిసిన బీజింగ్‌ లో భారత కౌన్సిలర్‌ నామ్‌ గ్యా సి కంపాతో పలు విషయాలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వివిధ చైనా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చి, ఇక్కడి పరిస్థితులను స్వయంగా చూసి వెళ్లారని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనకు, కనీస అవసరాలు తీర్చడానికి తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని నామ్‌ గ్యా సి కంపా అన్నారు. చైనాలోని పలు కంపెనీలు టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో చైనాకు చెందిన పలు సంస్థలు పెద్దఎత్తున కంపెనీలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆమెతోపాటు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికారి గౌరవ్‌ శ్రేష్ట కూడా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, సీఎం అదనపు కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్‌ ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చైనాలో భారత్‌ కౌన్సిలర్‌గా ఉన్న నామ్‌ గ్యాస్‌ సీకంపా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో నేడు కలిశారు. సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని భారత్‌ కౌన్సిలర్‌ సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం తన చైనా పర్యటన సందర్భంగా చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితిని స్వయంగా చూసి వెళ్లారని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా సీఎం భారత్‌ కౌన్సిలర్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ చట్టాన్ని చైనాలోని పలు కంపెనీలు ఇప్పటికే అధ్యయనం చేశాయి.

చైనాలో భారత్‌ కౌన్సిలర్‌గా ఉన్న నామ్‌ గ్యాస్‌ సీకంపా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో  కలిశారు. సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని భారత్‌ కౌన్సిలర్‌ సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం తన చైనా పర్యటన సందర్భంగా చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితిని స్వయంగా చూసి వెళ్లారని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా సీఎం భారత్‌ కౌన్సిలర్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ చట్టాన్ని చైనాలోని పలు కంపెనీలు ఇప్పటికే అధ్యయనం చేశాయి.