తెలంగాణలో పోలింగ్ 65.67శాతం
` అత్యధికంగా భువనగిరిలో 76.78.. హైదరాబాద్‌లో 48.48శాతం నమోదు
` 2019 లోక్‌సభ కంటే 3 శాతం పెరిగిన ఓటింగ్
` అసెంబ్లీ సెగ్మెంట్‌లో నర్సాపూర్ అత్యధికంగా 84.25.. మలక్‌పేట అత్యల్పంగా 42.76శాతం
` వివరాలు వెల్లడిరచిన సీఈవో వికాస్‌రాజ్
` స్ట్రాంగ్ రూమ్‌లకు చేరిన ఈవీఎంలు
` మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వెల్లడిరచారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటిం చారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 84.25శాతం, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 42.76శాతం నమోదైందని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3శాతం పోలింగ్ పెరిగిందన్నారు.జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో 47.03శాతం, చేవెళ్లలో 56.40, కరీంనగర్‌లో 72.54, ఖమ్మంలో 76.09శాతం, మహబూబాబాద్‌లో 72.43శాతం, మల్కాజ్‌గిరిలో 50.78శాతం, మెదక్‌లో 75.09శాతం, నాగర్ కర్నూల్‌లో 69.46శాతం, నల్గొండలో 74.02శాతం, నిజామాబాద్‌లో 71.92శాతం, పెద్దపల్లిలో 67.87శాతం, సికింద్రాబాద్‌లో 49.04శాతం, వరంగల్‌లో 68.86శాతం, జహీరాబాద్‌లో 74.63శాతం పోలింగ్ నమోదైందని సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 51.61శాతం పోలింగ్ నమోదైందని వెల్లడిరచారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
తెలంగాణ వ్యాప్తంగా ఇవిఎలంను ఆయా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములకు చేర్చారు. భద్రతా బలగాల సమక్షంలో వీటిని ఆయా కేంద్రాలకు చేర్చారు. సిసి కెమరాలను ఇప్పటికే అమర్చారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్టాంª`రగ్ రూమ్స్ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ పోలింగ్ పక్రియ ముగిసింది. నిన్న ఉదయం 7 గంటల పోలింగ్ మొదలవగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కొన్ని చోట్ల సరైన సమయానికే పోలింగ్ ముగియగా.. మరికొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద మాత్రం రాత్రి 11 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 6 గంటల లోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలు ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ పక్రియ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64.74శాతం పోలింగ్ నమోదు అయ్యింది.